Aarsha Ananda Sadanam  |  Sree Guru Madanananda Saraswati Peetham

శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠం

సాధనాత్ సాధ్యతే సర్వమ్

Unable to view the font ??? Click here

అత్యంత నిరాడంబరులు, ఆనంద స్వరూపులు, అపార తపోధన్యులు, నిష్కామధనులు, నిరంతర త్యాగ శీలురు, అపరిమితాన్నదాన తత్పరులు, సుందర మందిర బృంద నిర్మాణ ధురీణులు, ధర్మైక నియమ జీవనము, నిష్ఠాగరిష్టులు, అపర శివావతారులు, శ్రీ సదానంద పీఠాధిపులు శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య మదనానంద సరస్వతీ స్వామి వారి దివ్యాశీరనుగ్రహ పూర్వక మహదాదేశముతో ఈ ప్రాంతములో పరమహంస యతిధర్మ పరంపర ప్రసరణకై ఈ సంస్థ రూపుదిద్దుకున్నది.  

భక్తి సంపత్ప్రధానకరమగు దేవాలయ, జ్ఞాన సంపత్ప్రధానకరమగు విద్యాలయ (పాఠశాల), ఆరోగ్య సంపత్ప్రధానకరమగు వైద్యాలయ (ఆసుపత్రి) ములనే ఆలయత్రయ నిర్వహణ చెయ్యడం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములనే నాలుగు ఆశ్రమ ధర్మాలను పరిరక్షించుట ద్వారా భక్తి, జ్ఞాన, ధర్మమయ ఆరోగ్యకర ఆధ్యాత్మిక జ్యోతిని సకల మానవాళికి అందించడమే సంస్థ ప్రధానాంశం.  

శ్రీ శ్రీ శ్రీ మదనానంద సరస్వతీ స్వామి వారి ప్రియ శిష్యులు, నిరంతర యోగ జ్ఞానారూఢులు, త్యాగ ధనులు, నిరతాన్నదాన నియమశీలురు, శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠ వ్యవస్థాపక అధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ కృష్ణానంద సరస్వతీ స్వామి వారి పరిపూర్ణ దివ్యాంతర్వాణితో సంస్థ ఆశయాలను ప్రత్యక్షర ప్రత్యక్షం చేయుటకై అవిరళ కృషి చేస్తూ పురోగమనంలో పయనిస్తుంది.

శ్రీ సదానందో విజయతే    |  శ్రీమదనానంద సరస్వతీస్వామినే నమః   |  శ్రీకృష్ణానంద సరస్వతీస్వామినే నమః   |  శ్రీమహాగణపతయే నమః   |  శ్రీమాత్రే నమః
Copyright © 2007 Sree Guru Madananada Saraswati Peetham. All rights reserved.
Site Optimized to 1024 X 768 screen resolution and IE 6.0+
Powered by: IndiGenius